KE Prabhakar: టీడీపీకి మరో దెబ్బ... మరికాసేపట్లో అనుచరులతో కేఈ ప్రభాకర్ సమావేశం!

KE Prabhakar Meeting with Followers today

  • స్థానిక ఎన్నికల్లో అనుచరులకు అన్యాయం
  • టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి
  • తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో కేఈ

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్, పార్టీని వీడేందుకు రంగం సిద్ధమైంది. నేడు ఆయన తన అనుచరులతో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించనున్నారని సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆయన, తెలుగుదేశం పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన వర్గీయులు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యంగా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆగ్రహం ఆయనలో నెలకొనివుందని అంటున్నారు. కాగా, కేఈ ప్రభాకర్ ఏ పార్టీలో చేరనున్నారన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కొందరు వైసీపీలో చేరుతారని, మరికొందరు బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సాయంత్రం కేఈ ప్రభాకర్ మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.

KE Prabhakar
Telugudesam
Resign
  • Loading...

More Telugu News