Karanam Balaram: వైసీపీలో చేరిన కరణం వెంకటేశ్​

Karanam Venkatesh joins YSRCP

  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేశ్ 
  • మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్

ఏపీ సీఎం జగన్ ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్, మాజీ మంత్రి పాలేటి రామారావు ఇవాళ కలిశారు. జగన్ సమక్షంలో కరణం వెంకటేశ్, పాలేటి రామారావులు వైసీపీలో చేరారు. జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.  

జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితుడినై పార్టీలోకి వచ్చా

జగన్ సంక్షేమ పాలన చూసి ఆకర్షితుడినై పార్టీలోకి వచ్చానని కరణం వెంకటేశ్ అన్నారు. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో వెంకటేశ్ మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. వైసీపీ బలోపేతానికి, స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. కొన్నేళ్లుగా తాను టీడీపీలో పని చేశానని, ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరానని, దానిపై ఇప్పుడు విమర్శలు చేయాలనే ఆలోచన తనకు ఉండదని చెప్పారు.

Karanam Balaram
karanam venkatesh
Jagan
YSRCP
  • Loading...

More Telugu News