Nara Lokesh: జగన్​ ‘దద్దమ్మ’లా అడ్డదారులు తొక్కుతున్నారు: నారా లోకేశ్​

Nara Lokesh lashes out Jagan

  • టీడీపీ అభ్యర్థులపై కేసులు బనాయిస్తున్నారు
  • నామినేషన్ పత్రాలను చించేస్తున్నారు
  • పోలీస్, అధికారులను వైసీపీ నాయకుల్లా వాడుకుంటున్నారు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులపై కేసులు బనాయిస్తున్నారని, వారి నామినేషన్ పత్రాలను చించేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నారా లోకేశ్ మండిపడ్డారు. పోటీ చేసి గెలిచే దమ్ము లేక, జగన్ ‘దద్దమ్మ’లా అడ్డదారులు తొక్కుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాక్షస రాజ్యంలో నామినేషన్ వేసే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.

 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఒక పక్క పోలీసులను, మరో పక్క అధికారులను వైసీపీ నాయకుల్లా వాడుకుంటున్నారని విమర్శించారు. ‘స్థానిక’ ఎన్నికలను ఏకపక్షం చేసుకోవడానికి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారులే నామినేషన్ వేసే హక్కుని హరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Local Body Polls
  • Error fetching data: Network response was not ok

More Telugu News