Bonda Uma: ధ్వంసమైన కారును పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకొచ్చిన బోండా ఉమ

Bonda Uma meets Vijayawada police commissioner

  • విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చిన బోండా ఉమ
  • తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు
  • గన్ మెన్లతో రక్షణ కల్పించాలని విన్నపం

నిన్న మాచర్లలో తనతో పాటు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును టీడీపీ నేత బోండా ఉమ కలిశారు. దాడిలో ధ్వంసమైన కారును సీపీ కార్యాలయానికి ఉమ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని... గన్ మెన్లతో తనకు రక్షణ కల్పించాలని సీపీని కోరారు. తనకు గన్ మెన్లను తొలగించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అనంతరం మీడియాతో ఉమ మాట్లాడుతూ, మాచర్లలో వైసీపీ నేతల దాడిని సీపీకి వివరించామని చెప్పారు.

Bonda Uma
Vijayawada
Police Commissioner
Telugudesam
  • Loading...

More Telugu News