New Delhi: ఢిల్లీ అల్లర్లకు కుట్ర...పీఎన్ఏ అధ్యక్ష, కార్యదర్శుల అరెస్టు

Two arrest in Delhi rides case

  • దర్యాప్తులో పర్వేజ్,ఇలియాస్ బాధ్యులని తేలిందన్న పోలీసులు 
  • పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్ బాగ్ లో ఆందోళనలు 
  • ఈ సందర్భంగా హింసతో పలువురి మృతి

ఢిల్లీలో అల్లర్లకు కుట్రపన్నారన్న ఆరోపణలపై పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎన్ఏ) అధ్యక్ష, కార్యదర్శులు పర్వేజ్, ఇలియాన్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనల కారణంగా దేశరాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతం షహీనా బాగ్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో దాదాపు 46 మంది చనిపోయారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో పర్యటిస్తున్న సందర్భంలోనే ఈ అల్లర్లు చెలరేగడం విశేషం. రాజధానిలో అశాంతి సృష్టించాలని కుట్రపూరితంగానే ఈ అల్లర్లకు కారణమయ్యారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అందుకే వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పీఎస్ఎ సభ్యుడు మహ్మద్ దానిష్ ను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల వెనుక ఐసిస్ దంపతుల హస్తం ఉందని తేలడంతో కశ్మీరీలైన జహాన్ అబ్ సమీ (36), హీనాబషీర్ బేడ్లను గతంలోనే అరెస్టు చేశారు.

New Delhi
Rides
CAA
  • Loading...

More Telugu News