Veeru. K: పవన్ తో సినిమా రాసిపెట్టిలేదు: దర్శకుడు వీరూ.కె

Aro Pranam Movie

  • పవన్ ఆ కథను విన్నాడట 
  • ఆ సినిమా చేయడానికి ఆయన ఆసక్తిని చూపాడు 
  • నాకు విషయం ఆలస్యంగా తెలిసిందన్న వీరూ   

దర్శకుడు వీరూ.కె వివిధ భాషల్లో 28 సినిమాల వరకూ తెరకెక్కించారు. ఆయన రూపొందించిన సినిమాల్లో 'ఆరో ప్రాణం' విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'ఆరోప్రాణం' సినిమా కథను ముందుగా నేను నిర్మాత శ్రీనివాస్ రెడ్డిగారికి చెప్పాను. ఆ తరువాత ఆయన ఓ డబ్బింగ్ థియేటర్లో కలిసిన పవన్ కి ఆ కథ చెప్పాడు.

'కథ బాగుంది .. దర్శకుడిని పంపించు .. చేద్దాం' అన్నారట. కానీ శ్రీనివాసరెడ్డి ఆ విషయాన్ని నాకు చాలా ఆలస్యంగా చెప్పాడు. దాంతో ఒక మంచి సినిమాను పవన్ తో చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. పవన్ తో సినిమా చేసే అవకాశం లేదేమోనని అనుకున్నాను. ఆ రోజున పవన్ ను కలిసుంటే, ఆ తరువాత సినిమాలనైనా ఆయనతో కలిసి చేసే ఛాన్స్ ఉండేది. ఏదైనా రాసి పెట్టి ఉండాలని అంటారుగదా .. అందుకే నాకు రాసిపెట్టిలేదని అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Veeru. K
Pavan kalyan
Aro Pranam Movie
  • Loading...

More Telugu News