Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kajal opposite Dulkhar Salman in a Tamil flick

  • దుల్ఖర్ సల్మాన్ కి జంటగా కాజల్ 
  • రవితేజతో మరోసారి శ్రుతి హాసన్ 
  • ఇక రంగంలోకి దిగిన విశాల్

 *  అందాల కాజల్ అగర్వాల్ తాజాగా మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్ తో జతకడుతోంది. డ్యాన్స్ మాస్టర్ బృంద దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు చెన్నైలో మొదలవుతుంది.
*  రవితేజతో శ్రుతి హాసన్ మూడోసారి జోడీ కట్టనుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో 'తుప్పరివాలన్' చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి విదితమే. అయితే, ఈ చిత్రం సగం షూటింగ్ అయ్యాక విశాల్ కి, మిస్కిన్ కి మధ్య విభేదాలు తలెత్తడంతో దర్శకుడు ప్రాజక్టు నుంచి తప్పుకున్నాడు. ఇక ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో, ఇప్పుడు మిగిలిన షూటింగుకి తానే దర్శకత్వం వహిస్తానని విశాల్ ప్రకటించాడు.
 

Kajal Agarwal
Dulkhar Salman
Raviteja
Shruti Hassan
  • Loading...

More Telugu News