Madhya Pradesh: ఆయన ఇంటిపేరుతోనే ఎదిగారు.. ప్రశాంత్​ కిషోర్​ విమర్శలు

Prashant Kishors Jibe At Jyotiraditya Scindia

  • జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం కాంగ్రెస్ కు పెద్ద కుదుపేమీ కాదు
  • ఆయన ఇంటి పేరుతోనే రాజకీయ నాయకుడిగా మారారు
  • సింధియా బీజేపీలో చేరడాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్

మధ్యప్రదేశ్ లో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరడంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇంటి పేరు కారణంగానే జ్యోతిరాదిత్య సింధియా రాజకీయంగా ఎదిగారని కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.

‘‘గాంధీ ఇంటి పేరు కారణంగా కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే వాళ్లంతా.. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడటాన్ని పార్టీకి పెద్ద కుదుపుగా ఎలా భావిస్తారు? అసలు విషయం ఏమిటంటే.. సింధియా కూడా తన ఇంటి పేరుతోనే మాస్ లీడర్ గా, అడ్మినిస్ట్రేటర్ గా ఎదిగారు..” అని పేర్కొన్నారు.

మధ్య ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం

జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో మద్దతుగా మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. బీజేపీలో చేరిన సింధియాకు ఆ పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. త్వరలోనే కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News