Sujana Chowdary: రాష్ట్రంలో ఇంతటి అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదు: సుజనా చౌదరి

Sujana fires on YSRCP

  • రాష్ట్రంలో పలుచోట్ల నామినేషన్ల పర్వం హింసాత్మకం
  • బీజేపీ, జనసేన కార్యకర్తలపై దాడులు చేశారంటూ సుజనా ఆగ్రహం
  • ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ట్వీట్

రాయలసీమ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం హింసాత్మకం కావడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బీజేపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ సుజనా మండిపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంతటి అరాచకాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈ విధంగా విపక్షాల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Sujana Chowdary
Local Body Polls
BJP
Janasena
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News