Sharwanand: పారితోషికం విషయంలో శర్వానంద్ తగ్గడం లేదట!

SreeKaram Movie

  • శర్వానంద్ కి మంచి క్రేజ్ 
  •  వరుసగా మూడు ఫ్లాపులు 
  •  వెనకడుగేస్తున్న నిర్మాతలు

శర్వానంద్ కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా హడావిడిగా సినిమాలు చేసిన సందర్భాలు కనిపించవు. నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. అలాగే షెడ్యూల్ .. షెడ్యూల్ కి కూడా గ్యాప్ తీసుకుంటూ తాపీగా షూటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాడు. శర్వానంద్ ఎంచుకునే కథల కారణంగానే అటు యూత్ .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తుంటారు.

ఈ కారణంగానే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. అయితే ఇటీవల శర్వాకి వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. అయినా ఆయన తన పారితోషికం విషయంలో తగ్గడం లేదట. సినిమాకి ఆయన 7 కోట్ల వరకూ తీసుకుంటాడని టాక్. పారితోషికం విషయంలో తగ్గేది లేదని ఆయన చెబుతుండటంతో, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. శర్వా మాత్రం 'శ్రీకారం'తో పాటు ప్రస్తుతం తన చేతిలో వున్న మూడు సినిమాలపై దృష్టిపెట్టాడు.

Sharwanand
SreeKaram Movie
Tollywood
  • Loading...

More Telugu News