Panchakarla Ramesh: టీడీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

Ex MLA Panchakarla Ramesh resigns to TDP

  • టీడీపీకి వరుసగా గుడ్ బై చెపుతున్న నాయకులు
  • ఈరోజు పార్టీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్
  • నిన్ననే రాజీనామా చేసిన పులివెందుల సతీశ్ రెడ్డి

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వరుసగా ఒక్కో నేత పార్టీ నుంచి జారుకుంటున్నారు. పులివెందులలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్న సతీశ్ రెడ్డి నిన్న పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు.

యలమంచిలి నియోజకవర్గపు  మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని కొందరు చెపుతుండగా... ఆయన వైసీపీలో చేరొచ్చని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా ఈరోజు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Panchakarla Ramesh
Telugudesam
Resign
  • Loading...

More Telugu News