Corona Virus: కరోనా ఎఫెక్ట్.. రూ. 40కే కిలో చికెన్!

Chicken Rates Utterly decreased in Kurnool Dist

  • కర్నూలు జిల్లాలో అమాంతం పడిపోయిన చికెన్ విక్రయాలు
  • రూ. 40కే కిలో చికెన్ అంటూ బోర్డులు
  • చికెన్ వల్ల కరోనా రాదంటున్నా భయం వీడని వినియోగదారులు

చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో ఇటీవల విపరీత ప్రచారం జరిగింది. అది నిజం కాదని స్వయంగా ప్రభుత్వాలే ప్రకటన ఇచ్చాయి. అయినప్పటికీ ప్రజల్లో ఉన్న భయం మాత్రం పోయినట్టు కనిపించడం లేదు. ఫలితంగా చికెన్ విక్రయాలు దారుణంగా పడిపోయాయి.

దీంతో నష్టాల్లో కూరుకుపోతున్న వ్యాపారులు ధరలను దారుణంగా తగ్గించి విక్రయిస్తున్నారు. అయినా, విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. తాజాగా, కర్నూలు జిల్లాలో కిలో చికెన్ ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ. 40కు పడిపోయింది. జిల్లాలోని గూడూరు పంచాయతీ పరిధిలోని ఓ వ్యాపారి ఈ మేరకు దుకాణం ముందు బోర్డులు పెట్టి మరీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.

Corona Virus
Kurnool District
Chicken
  • Loading...

More Telugu News