Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Pooja Hegde about success and failures
  • పరాజయాల గురించి పూజ హెగ్డే 
  • మహేశ్ సినిమా పని మొదలెట్టిన పరశురాం 
  • పూరి జగన్నాథ్ సినిమా అప్ డేట్
 *  తనకి కెరీర్ మొదట్లోనే పరాజయాలు ఎదురయ్యాయని అంటోంది కథానాయిక పూజ హెగ్డే. 'అవును, తొలినాళ్లలోనే ఫెయిల్యూర్స్ పడ్డాయి. దాంతో కుంగిపోలేదు. వాటి నుంచి నేర్చుకున్నాను. అలాగే ఆత్మ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. అదే నన్ను ముందుకి నడిపిస్తోంది' అని చెప్పింది పూజ.
*  మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ క్రమంలో దర్శకుడు పరశురాం ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టు పనిలో బిజీగా వున్నాడు. మరోపక్క ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు నలభై రోజుల షూటింగ్ జరిగింది. దీంతో చాలావరకు షూటింగ్ పూర్తయింది. త్వరలో క్లైమాక్స్ సందర్భంగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ను భారీ ఎత్తున చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్ అనుకున్నప్పటికీ, ప్రస్తుతం మరో టైటిల్ కోసం ఆలోచిస్తున్నారట.
Pooja Hegde
Mahesh Babu
Parashuram
Puri Jagannadh

More Telugu News