Anand Reddy: అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం విషాదాంతం

  • ఆనంద్ రెడ్డి హత్యకు గురైనట్టు గుర్తించిన పోలీసులు
  • వ్యాపారి ప్రదీప్ రెడ్డి హత్యకు పాల్పడినట్టు భావిస్తున్న అనుమానం
  • ఆనంద్ రెడ్డిని మూడు రోజుల కిందట కారులో తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి
ఖమ్మంలో అపహరణకు గురైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. వ్యాపారి ప్రదీప్ రెడ్డి గొల్లబుద్ధారంలో ఆనంద్ రెడ్డిని అంతమొందించినట్టు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. వ్యాపారి ప్రదీప్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండడంతో ఆనంద్ రెడ్డిని అతడే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

కాగా, ఆనంద్ రెడ్డిని కిడ్నాప్ చేసిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా, వ్యాపారి ప్రదీప్ రెడ్డి మూడు రోజుల కిందట ఆనంద్ రెడ్డిని కారులో తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఆనంద్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు భూపాలపల్లి అడవుల్లో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Anand Reddy
Kidnap
Murder
Khammam
Assistant Labour Officer

More Telugu News