Nara Lokesh: ఈ కోర్టు తీర్పు చెడుపై మంచి సాధించిన విజయం: నారా లోకేశ్

Lokesh describes verdict compare with Holi

  • చెడుపై మంచి గెలిచిన రోజున హోలీ జరుపుకుంటాం 
  • అదే రోజున రంగులు చెరిపివేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామం 
  • ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రివర్స్ పాలన సాగిస్తున్నారని విమర్శలు

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులను తొలగించాలంటూ ఏపీ హైకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. చెడుపై మంచి గెలిచిన రోజును పురస్కరించుకుని రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకుంటామని, అదే రోజున ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను చెరిపివేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం చెడుపై మంచి సాధించిన విజయం అని అభివర్ణించారు.

"పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి మనసొప్పలేదు కానీ, రూ.1400 కోట్ల ప్రజాధనంతో రంగులు వేశారు. ఇప్పుడా రంగులు చెరిపివేసేందుకు మరో రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదేనా మీ రివర్స్ పాలన?" అంటూ ధ్వజమెత్తారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News