Junior Artist: సినీనటుడు లారెన్స్​ తమ్ముడిపై ఆరోపణలు.. జూనియర్​ ఆర్టిస్ట్​ దివ్య ఫిర్యాదు

Junior Artist Divya allgations

  • లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ 
  • తనను వేధిస్తున్నాడంటూ జూనియర్ ఆర్టిస్టు ఆరోపణలు
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కలిసి ఫిర్యాదు చేసిన దివ్య

ప్రముఖ సినీ నటుడు, డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ తనను వేధిస్తున్నాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదు మేరకు వినోద్ పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని వరంగల్ కు చెందిన దివ్య ఆరోపించింది.

వ్యభిచారం చేస్తున్నానన్న ఆరోపణల పేరిట తనను గతంలో అరెస్టు చేసిన పోలీసులు, వినోద్ కు సహకరిస్తున్నారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. వినోద్ లారెన్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తన ఫిర్యాదులో దివ్య కోరింది. 

Junior Artist
Divya
Cine Artist
Lawrence
brother
vinod
  • Loading...

More Telugu News