Revanth Reddy: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

Verdict on Revanth Reddy bail petition tomorrow

  • కేటీఆర్ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగరేశారని రేవంత్ రెడ్డి అరెస్ట్
  • బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
  • నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారన్న రేవంత్ రెడ్డి న్యాయవాది

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు చెందిన ఫాంహౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారన్న ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి కూకట్ పల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రేపటికి వాయిదా వేసింది. వాదనల సందర్భంగా.... తన క్లయింటుపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు బనాయించారని ఆరోపించారు.

Revanth Reddy
Bail
Petition
Court
KTR
Farm House
Drone
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News