Jagan: ‘జగనన్న విద్యా కానుక’లో 6 రకాల వస్తువులు ఉండాలని సీఎం జగన్​ సూచన

AP CM Jagan suggestions to education department

  • 3 జతల డ్రెస్సులు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్టు, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు ఉండాలి
  • వస్తువులు నాణ్యతతో ఉండాలి
  • పాఠశాలలు తెరిచే నాటికి వీటిని పంపిణీకి సిద్ధం చేయాలి

‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో ఆరు రకాల వస్తువులు ఉండాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. పాఠశాల విద్యపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ కిట్ లో మూడు జతల డ్రెస్సులు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్టు, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు ఉండాలని సూచించారు.

పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని, పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్ లు పంపిణీకి సిద్ధం చేయాలని, నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తి కావాలని జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై కూడా సమీక్షించారు. ‘జగనన్న విద్యా కానుక’ నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ, గోరుముద్ద, మధ్యాహ్న భోజనంపై యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయనకు తెలిపారు.

Jagan
YSRCP
Andhra Pradesh
cm
Education Department
  • Loading...

More Telugu News