MS Dhoni: ధోనీపై అభిమానాన్ని జెర్సీ రూపంలో చాటుకున్న పాకిస్థానీ

Pakistani seen wearing Dhoni jersey in PSL

  • ప్రపంచవ్యాప్తంగా ధోనీకి అభిమానులు
  • పీఎస్ఎల్ మ్యాచ్ లో ధోనీ పేరు, నెంబరు ఉన్న జెర్సీతో అభిమాని సందడి
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో దిగిన చాన్నాళ్లయింది. అభిమానులు అతడి విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా, ధోనీ ఎలా ఆడతాడన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఆడకపోయినా అభిమానులు మాత్రం అతడి నామస్మరణ ఆపలేదు. ఈ ఝార్ఖండ్ డైనమైట్ కు భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా, పాకిస్థాన్ లో ఓ యువకుడు ఏకంగా ధోనీ పేరు, నెంబర్ ఉన్న జెర్సీ ధరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పోటీలు జరుగుతుండగా, స్టేడియానికి వచ్చిన ఆ అభిమాని పాకిస్థాన్ క్రికెట్ సంప్రదాయ జెర్సీ ధరించినా, దానిపై ధోనీ పేరు, ధోనీకిష్టమైన 7 అనే నెంబరు ఉండడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

MS Dhoni
Pakistan
Jersey
PSL 2020
Fan
Cricket
  • Loading...

More Telugu News