Jyotiraditya Scindia: నిమిషాల వ్యవధిలోనే సింధియాను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్

Congress Expels Jyotiraditya Scindia For Anti Party Activities

  • మోదీని కలిసిన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సింధియా
  • సింధియాపై బహిష్కరణ వేటు వేసిన కాంగ్రెస్
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న వేణుగోపాల్

జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పార్టీ నుంచి సింధియా బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సింధియా తన రాజీనామా లేఖను పంపిన నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉదయం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన వెంటనే కాంగ్రెస్ కు సింధియా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు. సింధియా నిర్ణయంతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.

  • Loading...

More Telugu News