Prabhas: ప్రభాస్ కాపాడటం వల్లనే బతికి బయట పడ్డాను: 'ఛత్రపతి' శేఖర్

Chatrapathi Movie

  • సముద్రంలో 'ఛత్రపతి' షూటింగు జరుగుతోంది
  • హఠాత్తుగా షిప్పులో నుంచి జారిపోయాను 
  • ప్రభాస్ పట్టుకే ప్రాణం పోతుందనుకున్నానన్న శేఖర్

శేఖర్ మంచి నటుడు .. బుల్లితెరపై నుంచి వచ్చి, వెండితెరపై తన సత్తా చాటుకున్న నటుడు. అలాంటి శేఖర్ కి 'ఛత్రపతి' సినిమాలో పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి 'ఛత్రపతి' తన ఇంటిపేరుగా మారిపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ఛత్రపతి' సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావించాడు.

"ఈ సినిమా షూటింగు సముద్రంలో జరుగుతుండగా, నేను పట్టుతప్పి షిప్పులో నుంచి నీళ్లలోకి జారిపోయాను. వెంటనే ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, నాకు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. కానీ ఆయన వదిలిపెట్టాడంటే నేను షిప్పు కింద వుండే ఫ్యాన్ వైపు వెళ్లిపోతాను. అందువలన ఆయన అంత గట్టిగా పట్టుకుని, చాలా జాగ్రత్తగా పైకి లాగాడు. అయన కాపాడకపోయి వుంటే, ఆ గండం నుంచి నేను బతికి బయటపడే వాడిని కాదు" అని చెప్పుకొచ్చాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News