holi: అంబరాన్నంటేలా హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సెలబ్రిటీలు.. చిన్నారులు

holi celebrations in india

  • దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు
  • పాల్గొన్న రాజకీయ నాయకులు, క్రికెటర్లు
  • చిన్నారుల సందడి

దేశ వ్యాప్తంగా ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. పలువురు క్రికెటర్లు, సినీనటులు తమ కుటుంబ సభ్యులతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. పాండ్యా కుటుంబం తరఫున హోలీ శుభాకాంక్షలు అంటూ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ట్వీట్ చేశాడు.
       
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు నిన్న జరగగా, మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజు జరుగుతున్నాయి. పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణహితంగా రంగులకు బదులుగా పూలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. రాజ్‌భవన్‌ సిబ్బంది, పోలీసులపై పూలు చల్లుతూ ఉత్సాహంగా కనపడ్డారు.  
                               
               
 రంగులు పూసుకుంటూ హోలీ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
                
దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు హోలీ వేడుకలను జరుపుకున్నారు.  ప్రపంచంలోని పలు దేశాల్లోనూ హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా భయంతో మరికొందరు మాత్రం హోలీకి దూరంగా ఉన్నారు.

                                   

  • Error fetching data: Network response was not ok

More Telugu News