Thulasi: 'శంకరాభరణం' నాకు తీసుకొచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు: నటి తులసి

Shankara Bharanam Movie

  • చైల్డ్ ఆర్టిస్ట్ గా 120 సినిమాల వరకూ చేశాను 
  • మహామహులతో పాటు నన్ను ప్రశంసించేవారు 
  • 40 ఏళ్లు పూర్తికావడం ఆనందంగా ఉందన్న తులసి 

తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చెప్పుకోదగిన చిత్రాలలో 'శంకరాభరణం' ఒకటిగా కనిపిస్తుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తులసి మాట్లాడుతూ .."చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో 120 సినిమాల వరకూ చేశాను. నా అదృష్టం కొద్దీ అప్పట్లో నేను చేసిన ప్రతి సినిమాలో నాపై ఒక పాట ఉండేది. అలాగే 'శంకరాభరణం'లోను నాపై పాటలు వున్నాయి.

'శంకరాభరణం'తో నాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ సినిమా సక్సెస్ కి సంబంధించిన వేడుకలు దేశ విదేశాల్లో రెండేళ్ల పాటు జరుగుతూనే వచ్చాయి. విశ్వనాథ్ గారు .. నిర్మాతగారు .. సోమయాజులుగారు .. ఇలా మహామహులతో పాటు నన్ను కూడా ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. వాళ్లతో పాటు నాకు అవార్డులు ఇచ్చేవారు. వాళ్లతో పాటు నన్ను ప్రశంసించేవారు. ఈ సినిమా 40 ఏళ్లను పూర్తి చేసుకోవడం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.

Thulasi
K. Vishwanath
Shankara Bharanam Movie
  • Loading...

More Telugu News