Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Rakul about gym workouts

  • రకుల్ కసరత్తుల సంగతులు
  • రానా చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్ 
  • డబ్బింగ్ దశలో సాయి తేజ్ చిత్రం

 *  తాను కేవలం అందం కోసం కసరత్తులు చేయడం లేదంటోంది గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 'నేను మంచి ఫిజిక్ తో అందంగా కనపడడం కోసం కసరత్తులు చేయడం లేదు. ఆరోగ్యంగా వుండడం కోసమే చేస్తున్నాను. ముందు ఆరోగ్యంగా వుంటే అందం అదే వస్తుంది. అందుకే ప్రతి రోజూ ఓ గంట పాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తాను' అని చెప్పింది రకుల్  
* రానా, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం' చిత్రం రూపొందుతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరీడ్ డ్రామాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్టీఫెన్ రిచర్ పనిచేస్తున్నాడు. ఇందులో స్టంట్స్ కు వున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ టెక్నీషియన్ ని తీసుకున్నారట.  
*  మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది. ఈ క్రమంలో ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నభా నటేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.  

Rakul Preet Singh
Rana
Sai Pallavi
Sai Tej
  • Loading...

More Telugu News