Congress: కాంగ్రెస్‌కు షాకిచ్చిన సింధియా.. సంక్షోభంలో మధ్యప్రదేశ్ సర్కారు

Madhya pradesh gov is in crisis

  • 17 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోయిన సింధియా
  • సింధియా మద్దతుదారులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ
  • బీజేపీ నుంచి రాజ్యసభకు సింధియా?

మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయనకు మద్దతు ఇస్తున్న 17 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోయారు. అదృశ్యమైన ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు ఉండడం గమనార్హం. ఆచూకీ లేకుండా పోయిన అందరి ఫోన్లూ స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. వీరందరూ బెంగళూరులో మకాం వేసినట్టు చెబుతున్నారు. తాజా పరిస్థితితో దేశరాజకీయాల్లో మరోమారు వేడి పుట్టింది. సంక్షోభంలో పడిన సర్కారును కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

సింధియా బీజేపీలో చేరి రాజ్యసభ సభ్వత్వం తీసుకుంటారని, అనంతరం మంత్రి పదవి కూడా చేపడతారన్న వార్తలు నిన్నంతా షికారు చేశాయి. మరోవైపు, సింధియాకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి  బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇంకోవైపు, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కమల్‌నాథ్ చర్యలు ప్రారంభించారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి బుజ్జగించాలన్న ఉద్దేశంతో 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు.

Congress
Madhya Pradesh
Kamal Nath
Jyotiraditya Scindia
  • Loading...

More Telugu News