Ranjit Kumar Reddy: బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ టెక్కీ

Hyderabad techie commits suicide in Banglore

  • బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న రంజిత్ కుమార్ రెడ్డి
  • శుభకార్యం కోసం హైదరాబాద్ వచ్చిన తల్లిదండ్రులు
  • ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందిన టెక్కీ

హైదరాబాద్ కు చెందిన జి.రంజిత్ కుమార్ రెడ్డి అనే టెక్కీ బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 26 ఏళ్ల రంజిత్ కుమార్ రెడ్డి ఐఐటీ పట్టా అందుకున్నాక బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో తల్లిదండ్రులు కూడా రంజిత్ తో పాటు బెంగళూరులో ఉంటున్నారు.

అయితే, ఓ శుభకార్యం కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ రాగా, రంజిత్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. రంజిత్ కుమార్ రెడ్డి స్వస్థలం ఉప్పల్ లోని గణేశ్ నగర్. ఇంటర్ వరకు హైదరాబాదులోనే చదివి ఆపై ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించి ఉన్నత విద్య అభ్యసించాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Ranjit Kumar Reddy
Hyderabad
Banglore
Suicide
  • Loading...

More Telugu News