కుల విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తోంది: మారుతీరావు ఆత్మహత్యపై నటి మాధవీలత
- ఆయనకు బంగారం లాంటి కూతురు.. అల్లుడు, పండంటి మనవడు
- అందమైన జీవితాన్ని గడపకుండా కులమే అడ్డుగోడలు సృష్టించింది
- కూతురిని జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసింది
- ఆయన భార్యను శోకంలో ముంచింది
రాజకీయంలో భాగమవుతూ కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆమె చెప్పారు. వివక్షకు పునాది వేసి, ద్వేషానికి పాలు పోస్తూ, 'సామాజిక వర్గం' గా చెలామణీ అవుతున్న సామాజిక నేరం కులమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుల విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తున్నదని, ఒకప్పటి, నేటి, బాధితుల ద్వారానే వ్యాప్తి చెందుతున్నదని తీవ్ర విమర్శలు గుప్పించారు.