Corona Virus: ఇండియాలో 40వ కరోనా పాజిటివ్ కేసు... మూడేళ్ల చిన్నారికి సోకిన వ్యాధి!

Three Year old Boy positive for Corona
  • ఇటీవల ఇటలీ వెళ్లిన బాలుడి కుటుంబం
  • కుటుంబంలోని అందరికీ వైరస్
  • ఎర్నాకులం మెడికల్ కాలేజీలో చికిత్స
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వయో బేధం లేకుండా తన పరిధిలోకి వచ్చిన వారందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా కేరళకు చెందిన మూడేళ్ల బాలుడి రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇండియాలో కరోనా సోకిన వారి సంఖ్య అధికారికంగా 40కి చేరుకుంది. ఇటీవల బాలుడి కుటుంబం ఇటలీ నుంచి భారత్ కు వచ్చింది. ఈ కుటుంబంలోని వారందరికీ కరోనా సోకడం గమనార్హం. కరోనా పాజిటివ్ సోకిన బాలుడిని ఎర్నాకులం మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి నిపుణులైన వైద్య బృందం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.


Corona Virus
Ernakulam
Child
Italy

More Telugu News