Bhadradri Kothagudem District: భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలకు నేడు అంకురార్పణ

Bhadrachalam Ramaiah Marriage Works To Begin

  • నేడు తలంబ్రాలు కలపనున్న పూజారులు
  • 150 క్వింటాళ్ల బియ్యంలో 100 కిలోల ముత్యాలు 
  • రోలు, రోకలికి పూజల అనంతరం పసుపు దంచనున్న భక్తులు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఆలయ చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమంతో నేడు పనులు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా 150 క్వింటాళ్ల బియ్యంలో 100 కిలోల ముత్యాలు కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. ఇందుకోసం ఆలయ అధికారులు బియ్యం, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశారు. రోలు, రోకలికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పసుపుకొమ్ములు దంచనున్నారు. కాగా, నేడు స్వామి, అమ్మవార్లకు స్వపన తిరుమంజనం, వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు.  

  • Loading...

More Telugu News