Harbhajan Singh: విమానంలో హర్భజన్ సింగ్ బ్యాట్ మాయం!

Crickter Harbhajan Singh Bat Missing In Flight

  • ముంబై నుంచి కోవైకి వెళ్లిన హర్భజన్
  • ఇండిగో విమానంలో బ్యాటు మిస్సింగ్
  • విచారణ జరిపించాలని డిమాండ్

విమానంలో తన బ్యాటు చోరీకి గురైందని క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిర్యాదు చేశారు. భారత స్పిన్ బౌలర్ గా ఎన్నో కీలక విజయాలను అందించిన హర్భజన్, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. శనివారం నాడు అతను ముంబై నుంచి కోయంబత్తూరుకు విమానంలో వెళ్లారు.

కోవైలో దిగాక తన కిట్ బ్యాగ్ బరువు తక్కువగా అనిపించడంతో, చూడగా, బ్యాటు కనిపించలేదు. దీంతో వెంటనే ట్విట్టర్ ద్వారా ఇండిగో విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. తన బ్యాట్ పోయిందని, విచారించి, దాన్ని గుర్తించాలని సూచించారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఇండిగో ప్రతినిధి ఒకరు, బ్యాటును కనుగొనేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

Harbhajan Singh
Bat
Theft
Chennai
Kovai
Flight
Indigo
  • Loading...

More Telugu News