Corona Virus: ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘కరోనా‘ కాలర్​ ట్యూన్​

  • ఈ కాలర్ ట్యూన్ ద్వారా..
  • ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తుంది
  • ఈ వైరస్ కు సంబంధించిన తాజా సమాచారం,హెల్ప్ లైన్ నెంబర్లు

కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లో ‘కరోనా’ కాలర్ ట్యూన్ గా వినిపిస్తోంది. ఈ వైరస్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కాలర్ ట్యూన్ ద్వారా వివరించారు. అంతేకాకుండా,  ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కు సంబంధించిన తాజా సమాచారం, హెల్ప్ లైన్ నెంబర్లు, ఇతర వివరాలను ఇందులో పొందుపరిచారు.

బీఎస్ఎన్ ఎల్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో, ఇతర నెట్ వర్క్స్  పాక్షికంగా సంబంధింత సమాచారాన్ని అందుబాటులో ఉంచాయి. అన్నీ నెట్ వర్క్స్ ఈ కాలర్ ట్యూన్ ను ఉచితంగానే అందిస్తున్నాయి.  ఇంతకుముందే తమకు నచ్చిన కాలర్ ట్యూన్ ను సెట్ చేసుకున్నవారి మొబైల్స్ నుంచి మాత్రం ‘కరోనా’ ట్యూన్ వినిపించడం లేదు.  కాగా, నిన్నటి నుంచి మొబైల్స్ లో కాలర్ ట్యూన్ గా ‘కరోనా’ వినిపిస్తోంది.

Corona Virus
caller tone
central government
BSNL
  • Loading...

More Telugu News