Chittoor District: ఒంటరి వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో ఘటన

An Old Woman Raped by youth

  • భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళ
  • ఆవును మేపుకుంటూ పొలానికి వెళ్లిన బాధితురాలు
  • దాడిచేసి అత్యాచారం చేసిన నిందితుడు

ఒంటరి వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెంలో జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉదయ మాణిక్యం పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు (65) భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తోంది. నిన్న తన పాడి ఆవును మేపుకుంటూ తనకున్న రెండు ఎకరాల పొలం వద్దకు వెళ్లింది.

ఆమెపై కన్నేసిన గ్రామానికి చెందిన వడ్డె చిన్న రెడ్డప్ప (35) పథకం ప్రకారం ఆమె వెనకే వెళ్లాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గమనించి ఆమెపై దాడిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికి తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chittoor District
Old Woman
Rape
Crime News
  • Loading...

More Telugu News