Travels bus: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సులో పొగలు.. ప్రయాణికుల బెంబేలు!

Smoke came from Private Travels bus at Jadcharla
  • మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన
  • బస్సు లగేజీలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలే కారణం
  • మరో బస్సును ఏర్పాటు చేయని యాజమాన్యం
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయపడిపోయారు. వారి కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లకు చేరుకున్న కాసేపటికే బస్సులో పొగలు వ్యాపించాయి. బస్సును కమ్ముకున్న పొగను చూసిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును ఆపగానే అందరూ కిందికి దిగారు. బస్సు లగేజీలో రెండు ద్విచక్ర వాహనాలు ఉండడం వల్లే పొగలు వ్యాపించినట్టు గుర్తించి నిలిపివేశారు. అయితే, ఆ తర్వాత మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు మూడు గంటలపాటు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.
Travels bus
Hyderabad
Tirupati
Jadcharla

More Telugu News