Jagan: ఏపీ ‘స్థానిక’ సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్​ పై సీఎం జగన్​ కీలక నిర్ణయం

AP CM Jagan takes a key decision

  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు మించొద్దన్న హైకోర్టు
  • ఈ తీర్పు నేపథ్యంలో జగన్ నిర్ణయం
  • మిగిలిన 10 శాతం పార్టీ తరఫున బీసీలకు కేటాయించనున్న వైసీపీ

హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు అమలు కానున్న విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భావించిన వైసీపీకి ఈ తీర్పుతో ఎదురుదెబ్బతగిలినట్టయింది. అయితే, బీసీలకు 34 శాతం సీట్లు ఇచ్చే విషయమై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరఫున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. తమ పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Local body Elections
BC Reservations
  • Loading...

More Telugu News