Mahendran: విడుదలకి ముస్తాబవుతున్న 'అసలు ఏం జరిగిందంటే'!

Asalu Em Jarigindante Movie

  • క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మరో సినిమా 
  • హీరోగా మహేంద్రన్ పరిచయం 
  • ఈ నెలాఖరులో విడుదల

ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో చేసే ఈ సినిమాలు కంటెంట్ బాగుంటే చాలు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అందువలన ఆ తరహా కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా రూపొందిన చిత్రమే 'అసలు ఏం జరిగిందంటే'. అనిల్ బొద్దిరెడ్డి నిర్మాణంలో .. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, మహేంద్రన్ .. శ్రీ పల్లవి .. కారుణ్య .. కరోన్య ప్రధానమైన పాత్రలను పోషించారు.

ఫస్టు కాపీ వచ్చిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ .. "జీవితం మలుపు తిరగడానికి ఒక్క క్షణం చాలు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసిన మహేంద్రన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాము" అని చెప్పాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News