Samantha: నయనతార సినిమా నుంచి తప్పుకున్న సమంత?
![Samantha out from Vighnesh Shivan Movie](https://imgd.ap7am.com/thumbnail/tn-beadeedf1299.jpg)
- విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేశ్ శివన్ మూవీ
- ఒక కథానాయికగా నయనతార
- కోలీవుడ్లో షికారు చేస్తున్న వార్త
తెలుగు .. తమిళ భాషల్లో సమంతకు మంచి క్రేజ్ వుంది. ఇటీవల ఆమె తమిళంలో ఒక సినిమాను అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి కథానాయకుడిగా విఘ్నేశ్ శివన్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే.
ఒక కథానాయికగా నయనతార ఖరారైపోయింది. మరో కథానాయిక పాత్రకి సమంత అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని విఘ్నేశ్ శివన్ కి నయనతార చెప్పిందట. నయనతార రిక్వెస్ట్ మేరకే సమంత ఆ ప్రాజెక్టును అంగీకరించిందని కూడా చెప్పుకున్నారు. ఒకే తెరపై నయనతార - సమంతలను చూడాలని ముచ్చటపడిన అభిమానులు ఆనందపడిపోయారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుందనేది తాజా సమాచారం. అందుకు గల కారణం ఏమై ఉంటుందనేది తెలియాల్సి వుంది.