Sudha: ఎన్టీఆర్ మెచ్చుకున్నారు .. అది చాలు: సీనియర్ నటి సుధ

 Actress Sudha says she was complimented by NTR

  • కేరక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు
  • ఎన్టీఆర్ గారి స్థానంలో నా తండ్రిని ఊహించుకున్నాను 
  • ధైర్యంగా చేశానన్న సుధ    

తెలుగు తెరపై కేరక్టర్ ఆర్టిస్ట్ గా సుధ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ స్టార్ హీరోలకి అక్కగా .. వదినగా చేసిన ఆమె, యువతరం కథానాయకులకు తల్లి పాత్రలను చేస్తూ వెళుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 'మేజర్ చంద్రకాంత్' సినిమా షూటింగుకి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఆ సినిమాలో నేను రామారావుగారి కూతురు పాత్రను పోషించాను. ఒక వైపున రామారావుగారు .. మరో వైపున శారదగారు.. ఇంకో వైపున మోహన్ బాబుగారు. వాళ్ల కాంబినేషన్ సీన్ చేయడానికి నేను చాలా భయపడ్డాను. అక్కడ వున్నది రామారావుగారు కాదు .. నా తండ్రే అనుకుని ఆ సీన్ చేశాను. అంతే రామారావుగారు నన్ను దగ్గరికి తీసుకుని 'చాలా బాగా యాక్ట్ చేశావమ్మా' అన్నారు. ఆయన అభినందించారు .. అది చాలు నాకు. ఆ అవార్డు రాలేదు .. ఈ అవార్డు రాలేదు అనే బాధ నాకు అందుకే లేకుండా పోయింది" అని చెప్పుకొచ్చారు.

Sudha
Ntr
Sharada
Major Chandrakanth Movie
  • Loading...

More Telugu News