Rajinikanth: రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు ‘కరోనా’ అడ్డంకి!

Rajinikanth Movie shooting cancels over corona virus
  • శివ దర్శకత్వంలో అణ్ణాత్త సినిమాలో నటిస్తున్న రజనీ
  • ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్
  • కోల్‌కతా, పుణెల షెడ్యూల్ వాయిదా
కరోనా వైరస్ కారణంగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో ‘అణ్ణాత్త’ అనే సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడి షెడ్యూల్ పూర్తయిన వెంటనే కోల్‌కతా, పూణెలలో కొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ భయపెడుతుండడంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Rajinikanth
Movie shooting
Hyderabad
kolkata
Pune

More Telugu News