Marakkar: 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి

Chiranjeevi launches Mohanlal new film Marakkar trailer

  • విశేషంగా ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ కొత్త చిత్రం ట్రైలర్
  • ట్రైలర్ రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్న చిరు
  • చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం 'మరక్కార్... అరబిక్ కడలింతే సింహం'. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ట్రైలర్ ను చిరంజీవి, రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు తన సందేశాన్ని వెలువరించారు.

"నా ప్రియ మిత్రుడు మోహన్ లాల్, ప్రియదర్శన్ ల డ్రీమ్ ప్రాజెక్టు 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ తిరు మరోసారి వెండితెరపై అద్భుత చిత్రకావ్యాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నా. చిత్రబృందం మొత్తానికి శుభమస్తు" అని పేర్కొన్నారు.

సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్ లో భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న 'మరక్కార్...' చిత్రంలో మోహన్ లాల్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రల్లో అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. అంతే కాదు, మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో యశ్, తమిళంలో సూర్య రిలీజ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News