Raghava Lawrence: రాఘవ లారెన్స్ తమ్ముడు నన్ను వేధిస్తున్నాడు: జూనియర్ ఆర్టిస్ట్ దివ్య

Junior Artist allegations on Choreographer Raghava Lawrence brother

  • ప్రేమను తిరస్కరించడంతో లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు
  • ఓ పోలీసు అధికారి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
  • నాకు ప్రాణభయం ఉంది

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ తమ్ముడు వినోద్ (ఎల్విన్) తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించింది. అతని ప్రేమను తాను తిరస్కరించడంతో వేధించడం మొదలు పెట్టాడని చెప్పింది.

ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... వినోద్ వేధింపులను తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని... అయితే సీఐతో కుమ్మక్కై వారు తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది. ఇప్పుడు ఆ అధికారి ఏసీపీగా ఉన్నారని చెప్పింది. ఆ అధికారి లారెన్స్ కు నమ్మినబంటులా మారిపోయారని తెలిపింది. వీరందరి చీకటికోణాలు తనకు తెలుసని చెప్పింది.

సదరు పోలీసు అధికారి అండతో వారు తనను జైలుకు పంపించారని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా తనను కొందరు ఫాలో అవుతున్నారని... లారెన్స్ తమ్ముడితో తనకు ప్రాణ భయం ఉందని చెప్పింది. వారు తనను చంపాలనుకుంటున్నారని తెలిపింది. తనను కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకుంటున్నానని చెప్పింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News