Nara Lokesh: ‘దిశ’ చట్టం వైసీపీ వాళ్ల కేనా? సామాన్య మహిళలకు వర్తించదా?: నారా లోకేశ్​

 Nara Lokesh questions about Disha law

  • ‘దిశ’ అమలు తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజధాని మహిళలు
  • మహిళలపై పోలీసులతో లాఠీచార్జి చేయించారు
  • ఆ దెబ్బలు ఇంకా తగ్గలేదు.. ‘దిశ’తో న్యాయం జరగడం లేదు

‘దిశ’ చట్టం అమలు తీరుపై ప్రభుత్వాన్ని మహిళలు ప్రశ్నిస్తున్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ‘దిశ’ చట్టం వైసీపీ వాళ్లకేనా... సామాన్య మహిళలకు వర్తించదా? అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహిళలపై పోలీసులతో లాఠీచార్జి చేయించారని, ఆ దెబ్బలు ఇంకా తగ్గలేదని రాజధాని ప్రాంత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కేసులు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు? దిశ చట్టం తీసుకొచ్చినా తమకు న్యాయం జరగడం లేదంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళల భద్రతకు పాటుపడతామని ప్రభుత్వం చెప్పినా ఉపయోగం లేదని, తమకు న్యాయం జరగడం లేదంటూ రాజధాని ప్రాంత మహిళ విమర్శించడం ఈ వీడియోలో కనబడుతుంది.

Nara Lokesh
Telugudesam
Disha
Law
Amaravati
  • Loading...

More Telugu News