నా నిజమైన స్నేహితుడు రామ్ చరణ్: మంచు మనోజ్
- కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు
- నా స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు నేను ఎప్పుడూ అండగా ఉంటా
- 'అహం బ్రహ్మాస్మి' తొలి ప్రొడక్షన్ వర్క్ ను రామ్ చరణ్ ప్రారంభించబోతున్నాడు
మంచు మనోజ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మాస్మి' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రొడక్షన్ వర్క్ ను రామ్ చరణ్ ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా ఈ మేరకు స్పందించాడు. 'అహం బ్రహ్మాస్మి' తొలి ప్రొడక్షన్ వర్క్ ను తన సోదరుడు రామ్ చరణ్ ప్రారంభించబోతున్నాడని... చరణ్ కు తమ టీమ్ సాదరంగా స్వాగతం పలుకుతోందని చెప్పాడు. చరణ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.