Vijay Devarakonda: కరణ్ జోహర్ మనసు దోచేసిన విజయ్ దేవరకొండ

Karan Johar Movie

  • పూరి సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ
  • నేరుగా హిందీ సినిమా చేయించే ఆలోచనలో కరణ్ 
  • విజయ్ దేవరకొండతో జరిగిన చర్చలు

ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూరి సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుండగా, నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహర్ వున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాయికగా అనన్య పాండే నటిస్తోంది.

ఈ సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ నటనను కరణ్ జోహర్ ప్రత్యక్షంగా చూశాడట. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ కరణ్ కి బాగా నచ్చేశాయట. అసలు కెమెరాను పట్టించుకోకుండా ఆయన చేసే సహజమైన నటనకి ఫిదా అయిన కరణ్ జోహర్, విజయ్ దేవరకొండతో హిందీలో సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. హిందీలో సినిమాలు చేసి, సౌత్ లోని మిగతా భాషల్లోను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడని అంటున్నారు. ఈ విషయాన్ని గురించి ఆయన విజయ్ దేవరకొండతో మాట్లాడటం కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News