Yes Bank: యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఏటీఎంల వద్ద ఖాతాదారుల క్యూ
- నిధుల కొరత ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్
- నెలకు రూ. 50 వేలకు మించి డ్రా చేసుకోకుండా ఆంక్షలు
- నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్ అవడం లేదంటున్న ఖాతాదారులు
యస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళనలో మునిగిపోయారు. తమ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ఆ బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూకట్టారు. దీంతో ఏటీఎంలు కిక్కిరిసిపోయాయి.
యస్ బ్యాంకు నిధుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖాతాదారులు నెలకు రూ. 50 వేలకు మించి విత్ డ్రా చేసుకోరాదంటూ ఆర్బీఐ ఆంక్షలు విధించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఆర్బీఐ ప్రకటనతో ఆందోళనకు గురైన ఆ బ్యాంకు ఖాతాదారులు ఈ ఉదయం నుంచే ఏటీఎంల వద్ద బారులు తీరారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు పోటీలు పడ్డారు. మరోవైపు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును వేరే ఖాతాల్లోకి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఖాతాదారులు అంటున్నారు.