Indian Student: దుబాయ్ లో 16 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్ కు కరోనా... తండ్రి నుంచే సోకింది!

Indian Student in Dubai Corona Positive
  • విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన విద్యార్థి తండ్రి
  • కుటుంబం మొత్తానికీ చికిత్స
  • వైరస్ వ్యాపించకుండా చర్యలు
దుబాయిలో ఓ భారత విద్యార్థికి కరోనా సోకింది. ఇక్కడి ఇండియన్ స్కూల్‌ లో చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థికి అతని తండ్రి నుంచే వ్యాధి సోకిందని డాక్టర్లు తేల్చారు. ఆ విద్యార్థి తండ్రి ఇటీవలే విదేశీ పర్యటకు వెళ్లి రాగా, ఐదు రోజుల తరువాత ఆయనలో వైరస్ కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. దీంతో అతను ఆసుపత్రిలో చేరగా, ఆ వెంటనే అతని కుమారుడికి కూడా వ్యాధి సోకింది.

ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. వారి ఆరోగ్యం ప్రస్తుతానికి మెరుగ్గానే ఉందని అన్నారు. ఈ వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలనూ తీసుకున్నామని, స్కూళ్లు, కంపెనీలపై ప్రత్యేక దృష్టి సారించామని దుబాయి హెల్త్ అథారిటీ పేర్కొంది. కాగా, నగర వ్యాప్తంగా ఇప్పటికే పలు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.
Indian Student
Dubai
Corona Virus

More Telugu News