Batchula Arjunudu: మోపిదేవి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది: బచ్చుల అర్జునుడు

Batchula Arjunudu fires on Mopidev venkataramana

  • బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం
  • వారికి రాజ్యాధికారం ఇచ్చింది మా పార్టీ
  • బీసీల కోసం జగన్ శాశ్వతప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?

బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీయే అడ్డుపడుతోందన్న ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శలపై టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల కోసం పుట్టింది, వారికి రాజ్యాధికారం ఇచ్చింది, వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మరిచిపోయి ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు.

 ఓ మంత్రిగా చెప్పాల్సిన మాటలు చెప్పడంలో తప్పులేదు గానీ అవాస్తవాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. బీసీల కోసం జగన్ శాశ్వతప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పడం కరెక్టు కాదని, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం తగదని అన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల డబ్బులను రాజకీయ ప్రయోజనాల పథకాలకు వాటిని మళ్లించారని, ఈ విధంగా చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News