Revanth Reddy: రేవంత్​ రెడ్డికి రిమాండ్​.. చర్లపల్లి జైలుకు తరలింపు!

 14 day remand to Revant Reddy

  • గోల్కోండ ప్రభుత్వ ఆసుపత్రిలో రేవంత్ కు వైద్యపరీక్షలు
  • ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరిచిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరిచగా, రేవంత్ కు 14 రోజుల రిమాండును విధించారు. ఈ ఆదేశాల మేరకు రేవంత్ ను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.

అంతకుముందు, గోల్కోండ ప్రభుత్వ ఆసుపత్రికి రేవంత్ ను తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా, ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి రంగారెడ్డి జిల్లాలోని మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలను ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  

Revanth Reddy
Telangan
Congress
Remand
charlapalli jail
  • Loading...

More Telugu News