Jagan: ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టు షాపులు ఉండడానికి వీల్లేదు: సీఎం జగన్

AP CM Jagan attends review meet on state excise and enforcement departments

  • ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
  • బెల్టు షాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని స్పష్టీకరణ
  • బెల్టు షాపులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  • మహిళా మిత్రల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని వెల్లడి

ఏపీ సీఎం జగన్ సచివాలయంలో ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టు షాపులు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎక్సైజ్ సిబ్బంది వీటిపై మహిళా పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలని, బెల్టు షాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో మహిళ మిత్రల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. బెల్టు షాపులపై ఎక్సైజ్ విభాగం కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి తమ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్కులు, ఇంగ్లీష్ విద్య వంటి పథకాలు అమలు చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News