'సాహో' దర్శకుడిపై దృష్టిపెట్టిన చిరంజీవి?
- కొరటాల సినిమాతో బిజీగా చిరూ
- 'లూసిఫెర్' రీమేక్ కి సన్నాహాలు
- దర్శకుడిగా సుజీత్ కి ఛాన్స్ దక్కే అవకాశం
దాంతో తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ దక్కించుకున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ నేపథ్యంలో వినాయక్ .. హరీశ్ శంకర్ ల పేర్లు వినిపించాయి. తాజాగా 'సాహో' దర్శకుడు సుజీత్ పేరు తెరపైకి వచ్చింది. 'సాహో' ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రభాస్ ను సుజీత్ చాలా స్టైలిష్ గా చూపించాడు. భారీ సినిమానే అయినా బాగా డీల్ చేశాడు. అందువలన సుజీత్ పై చిరూ దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మరి.