Corona Virus: గాంధీలో 'కరోనా' వార్డు తీసేయాలంటూ జూనియర్‌ డాక్టర్ల డిమాండ్!

protest in gandhi

  • కాసేపట్లో సూపరింటెండెంట్‌ను కలవనున్న జూడాలు
  • ఓపీ పేషెంట్లు తగ్గిపోతున్నారని ఆందోళన
  • చాలా ఇబ్బందులు పడుతున్నారంటున్న జూడాలు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా అనుమానంతో రోగులు వస్తున్నారు. కరోనా వ్యాధి సోకే వారి కోసం ఆ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డును కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగాలని యోచిస్తున్నారు. దాన్ని నగర శివారు ప్రాంతానికి తరలించాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై వారు కాసేపట్లో గాంధీ సూపరింటెండెంట్‌ను కలవనున్నారు. గాంధీ ఆసుపత్రికి ఓపీకి ఇతర రోగులు వందల సంఖ్యలో వస్తుంటారని, అయితే, వారు కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారని జూనియర్‌ డాక్టర్లు అంటున్నారు.

ఓపీకి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతోందని వారు చెప్పారు. ప్రతి రోజు దాదాపు 2000 మంది ఓపీ పేషెంట్లు వచ్చేవారని, ప్రస్తుతం కేవలం 500 మంది మాత్రమే వస్తున్నారని వారు అంటున్నారు.  కరోనా వార్డును గాంధీలో ఉంచొద్దని వారు సూపరింటెండెంట్‌ను కోరనున్నారు.

  • Loading...

More Telugu News